e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home క్రైమ్‌ కొట్టి చంపారు.. శవాన్ని మాయం చేశారు

కొట్టి చంపారు.. శవాన్ని మాయం చేశారు

కొట్టి చంపారు.. శవాన్ని మాయం చేశారు
  • మల్లంపేటలో వ్యక్తిని హత్యచేసిన ఇద్దరు సెక్యూరిటీగార్డులు
  • నిందితులను పట్టించిన సీసీ కెమెరాలు

దొంగతనం నెపంతో ఓ వ్యక్తిని ఇద్దరు సెక్యూరిటీగార్డులు కొట్టి చంపారు.. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి సమీపంలోని చెరువులో పడేశారు.. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో బయటపడ్డాయి. ఆ సెక్యూరిటీగార్డులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18న మల్లంపేట చెరువులో సురేశ్‌ మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే.. వివరాల్లోకి వెళితే.. మల్లంపేటలోని లక్ష్మీశ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌లో సురేశ్‌(28) కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. సురేశ్‌ మద్యానికి బానిస కావడంతో అతడి భార్య నాలుగు నెలల కిందట విడాకులు తీసుకొని మరొకరిని వివాహం చేసుకున్నది. ఒంటరిగా ఉంటున్న సురేశ్‌ మరింత మద్యానికి బానిసయ్యాడు. కాగా.. సురేశ్‌ నివాసం పక్కనే ఉన్న డ్రీమ్‌వ్యాలీలో రెండు నెలల కిందట దొంగతనం జరిగింది. ఈ నెల 17న రాత్రి సురేశ్‌ మద్యం మత్తులో డ్రీమ్‌వ్యాలీలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా…అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు సెక్యూరిటీగార్డులు అతడిని పట్టుకొని ప్రశ్నించగా ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది. వారు ఇనుపరాడ్డుతో సురేశ్‌ను కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేరం తమ మీదకు వస్తుందని భావించిన ఆ సెక్యూరిటీగార్డులు మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి ఖత్వాచెరువులో పడేసి చేతులు దులుపుకున్నారు.

సీసీకెమెరాల్లో పక్కా ఆధారాలు…

  • సురేశ్‌ మృతిపై పలు అనుమానాలు, వాస్తవాలు సీసీకెమెరాల ద్వారా సంక్షిప్తమైనట్లు సమాచారం.
  • ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా హత్య చేసి చెరువులో పడేసినట్లు అనుమానం రావడంతో పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
  • ఈ దర్యాప్తులో డ్రీమ్‌వ్యాలీకాలనీలో ఉన్న సీసీకెమెరాల ఆధారంగా సెక్యురిటీగార్డులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొట్టి చంపారు.. శవాన్ని మాయం చేశారు

ట్రెండింగ్‌

Advertisement