e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home హైదరాబాద్‌ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి: సీపీ సజ్జనార్‌

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి: సీపీ సజ్జనార్‌

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి: సీపీ సజ్జనార్‌

శేరిలింగంపల్లి, మే 31 : పొగాకు, ఇతర మాదకద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పొగాకు, పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల శ్వాసకోస వ్యాధులు, నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధుల భారిన పడటం జరుగుతుందని అన్నారు. వీటికి ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్‌, ప్రతినిధులు కోటేశ్వరరావు, రామ్మోహన్‌ రావు, పాలం శ్రీను, ఎల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి: సీపీ సజ్జనార్‌

ట్రెండింగ్‌

Advertisement