e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home హైదరాబాద్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

చర్లపల్లి, మే 31: లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు. సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఈసీఐఎల్‌ చౌరస్తాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. వాహనదారులను తనిఖీ చేసి పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 47 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాక ఐదు జాతీయ రహదారులపై ఆంక్షలను విధించామన్నారు. నిబంధనలు పాటించని వారిని గుర్తించి 62 వేల కేసులు నమోదు చేయడంతో పాటు 16 వేల వాహనాలను సీజ్‌ చేశామన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ, కుషాయిగూడ డివిజన్‌ ఏసీపీ శివకుమార్‌, ఇన్స్‌పెక్టర్‌ మన్‌మోహన్‌, డీఐ గురువారెడ్డి, ట్రాఫిక్‌ సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ఎస్సైలు శ్రీనివాస్‌, అనంతచారి, మదన్‌లాల్‌, వీరస్వామి, పవన్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

ట్రెండింగ్‌

Advertisement