e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home హైదరాబాద్‌ అత్యవసర సేవలకు ఆటంకం లేదు

అత్యవసర సేవలకు ఆటంకం లేదు

అత్యవసర సేవలకు ఆటంకం లేదు
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • కర్ఫ్యూ గస్తీలో పాల్గొంటున్న సీపీలు

రాత్రి కర్ఫ్యూను రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌లు నిశితంగా గమనిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు, వైన్స్‌ షాపులు, పబ్బులు 8 గంటలకు మూసివేసే విధంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్‌ కమిషనర్లు మహేశ్‌ భగవత్‌, సజ్జనార్‌ స్వయంగా పోలీస్‌ అధికారులతో కలిసి కర్ఫ్యూ గస్తీలో పాల్గొంటున్నారు. అత్యవసర సేవలకు ఇబ్బందులు లేకుండా వారికి అనుమతిస్తున్నారు.

  • ముఖ్యం గా వైద్య చికిత్సలు, మందులు కావాల్సిన వారికి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు.
  • అదేవిధంగా విమాన ప్రయాణాలు చేసే వారికి కూడా వారి టిక్కెట్‌ను చూసి ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
  • తిరిగి వచ్చే సమయంలో క్యాబ్‌ డ్రైవర్‌లు ప్రయాణికుడిని వదిలినప్పుడు ఆ టిక్కెట్‌ను ఫొటో తీసుకుని తిరుగు ప్రయాణంలో చూపిస్తే అనుమతిస్తున్నా రు.
  • ప్రజలు స్వచ్ఛందంగా 8 గంటలకు దుకాణాలను మూసివేసి ఇండ్ల కు చేరుతున్నారని తెలిపారు.
  • నిబంధనలు ఉల్లంఘించే వారిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద కేసులు నమోదు చేయడంతో పాటు మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అత్యవసర సేవలకు ఆటంకం లేదు

ట్రెండింగ్‌

Advertisement