సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ) సహకారంతో ముజ్తాబ హెల్పింగ్ ఫౌండేషన్ నగర పోలీసులకు ఉచిత అంబులెన్స్, ఎన్95 మాస్క్లు, శానిటైజర్లు అందజేసింది. బుధవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ జెండా ఊపి అంబులెన్స్ ప్రారంభించారు. హెచ్సీఎస్సీ డైరెక్టర్ రాజశేఖర్, ఫౌండేషన్ ప్రతినిధి షేక్ ముస్తాఫ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.