e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News వాహ‌న‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు : సీపీ అంజ‌నీ కుమార్

వాహ‌న‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు : సీపీ అంజ‌నీ కుమార్

వాహ‌న‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు : సీపీ అంజ‌నీ కుమార్

హైద‌రాబాద్ : అంబ‌ర్‌పేట్, సికింద్రాబాద్ ఏరియాల్లో లాక్‌డౌన్‌ను న‌గర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అంజ‌నీ కుమార్ మీడియాతో మాట్లాడారు. జంట న‌గ‌రాల్లో 80కి పైగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామ‌న్నారు. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చే వాహ‌న‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. జంట న‌గ‌రాల్లో నిన్న ఒక్క‌రోజే 5 వేల‌కు పైగా కేసులు న‌మోదు చేశామ‌న్నారు. నిన్న ఒక్క‌రోజే సుమారు 8 వేల వాహ‌నాలు జ‌ప్తు చేశామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించాలి. లాక్‌డౌన్ అమ‌లుతో న‌గ‌రంలో క‌రోనా పాజిటివ్ కేసులు చాలా త‌క్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. ప్ర‌జ‌లు ఇలాగే స‌హ‌క‌రిస్తే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌లుగుతామ‌ని సీపీ అంజ‌నీ కుమార్ అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాహ‌న‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు : సీపీ అంజ‌నీ కుమార్

ట్రెండింగ్‌

Advertisement