శనివారం 04 జూలై 2020
Hyderabad - Jun 01, 2020 , 01:54:42

అవగాహనతోనే కరోనాకు దూరం: సీపీ అంజనీకుమార్‌

అవగాహనతోనే కరోనాకు దూరం: సీపీ అంజనీకుమార్‌

హైదరాబాద్ :కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ సూచించారు.సామాజిక కార్యకర్త, షార్ట్‌ ఫిలిం యాక్టర్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ నిపుణులు యూత్‌ ఫర్‌ సేవా అండ్‌ సేవారాత్‌ సంస్థతో ఆదివారం సీపీ వెబ్‌నార్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా కట్టడి,లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు,సలహాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని సూచించారు. ఈ సమావేశంలో సుశీల్‌రావు, రేఖారావు, పవన్‌జీ, అశ్విన్‌ పాల్గొన్నారు.


logo