e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home హైదరాబాద్‌ ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌
  • ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్‌
  • ఇప్పటి వరకు 136 మంది అరెస్ట్‌.. 58 కేసులు నమోదు
  • మెడికల్‌ ఫీల్డ్‌కు సంబంధమున్నవారే దందా :సీపీ అంజనీకుమార్‌

సిటీబ్యూరో, జూన్‌ 21(నమస్తే తెలంగాణ): బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో ఉపయోగించే ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు.. కూకట్‌పల్లికి చెందిన కొండూరు క్రాంతికుమార్‌ మెడిక్స్‌ ఫార్మసీ యజమాని. నంగనూరి వెంకట్‌ దినేశ్‌ శంకర్‌ ఫార్మసీ యజమాని. శ్రీబాలాజీ మెడిసిన్‌ యజమాని శిఖాకొల్ల శ్రీనివాస్‌లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. దవాఖానల్లో కొందరు రోగులు తమ చికిత్స కోసం తెచ్చుకున్న మందుల్లో మిగిలినవి, నకిలీ పత్రాలు పెట్టి మెడికల్‌ షాప్‌ల ముసుగులో సేకరించిన 30 లిప్సోమల్‌ ఎంపోటెరిసిన్‌ బీ ఇంజక్షన్లు(ఎంఆర్‌పీ రూ.7,444) ఒక్కటి రూ. 35 వేలకు, 6 పోసకొనాజోల్‌ ఇంజక్షన్లు(ఎంఆర్‌పీ రూ. 8500)లను ఒక్కటి రూ. 50 వేల చొప్పున విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వారు సోమవారం నెక్లెస్‌ రోడ్డు వద్ద వాటిని విక్రయించడానికి వచ్చారు. సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ జావెద్‌ బృందం ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేసి.. వారి వద్ద నుంచి 36 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకుంది.

450 ఇంజక్షన్లు స్వాధీనం

కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చినప్పటి నుంచి నగరంలో బ్లాక్‌ మార్కెట్‌లో ఇంజక్షన్లను విక్రయించిన 136 మందిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ వెల్లడించారు. మొత్తం 58 కేసులు నమోదు చేసి.. 450 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆసుపత్రుల్లో పనిచేసేవారు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు, మెడికల్‌ దుకాణం నిర్వాహకులు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ ఇలా మెడికల్‌ ఫీల్డ్‌తో సంబంధమున్న వారే ఈ బ్లాక్‌ మార్కెట్‌ దందాను నిర్వహిస్తున్నారన్నారు. వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసి అవసరమైన వారిని గుర్తించడం, ఇంజక్షన్లను విక్రయించే వారితో మాట్లాడుతూ దందాను నిర్వహిస్తున్నారని.. మూడు రోజుల క్రితం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన ముఠాతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. ఆ వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ను కూడా అరెస్ట్‌ చేశామని, ఆ గ్రూప్‌ను తొలగించేశామన్నారు. నాలుగైదు రకాలుగా బ్లాక్‌ మార్కెట్‌లోకి ఇంజక్షన్లు వస్తున్నాయని వివరించారు. ప్రజలు ఏదైనా సమాచారం ఉంటే ఫోన్‌: 9490616555 కు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. సమావేశంలో అదనపు సీపీ శిఖాగోయెల్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ(ఓఎస్‌డీ) రాధాకిషన్‌రావు, సెంట్రల్‌ జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ జావెద్‌, ఎస్సైలు శ్రీధర్‌, శ్రీనివాసులు, మహమద్‌ షాన్‌వాజ్‌ షఫీ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌
ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌
ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement