సిటీబ్యూరో, జూన్ 7(నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు సోమవారం చెలాపురలోని సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సీపీ అంజనీకుమార్ సందర్శించి, పోలీసు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అందరిని పలుకరిస్తూ వాళ్ల ఆరోగ్యం, ఇతరాత్ర విషయాలను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట సౌత్‌జోన్ డీసీపీ గజరావు భూపాల్ తదితర అధికారులున్నారు.