e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home హైదరాబాద్‌ వేగంగా కోలుకుంటున్నారు

వేగంగా కోలుకుంటున్నారు

వేగంగా కోలుకుంటున్నారు
  • 20 నుంచి 40 ఏళ్ల వారు జాగ్రత్తగా ఉండాలి
  • ప్రజల అప్రమత్తతతోనే వైరస్‌ వ్యాప్తికి కట్టడి: వైద్య విభాగాలు

కరోనా రెం డో దశ వ్యాప్తి పట్ల ప్రజలు ఎవరికి వారు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా వైరస్‌ ఇతరులకు సోకకుండా కట్టడి చేసేందుకు వీలవుతుందని వైద్య విభాగాలు పేర్కొంటున్నాయి. కరోనా బారిన పడుతున్న వారిలో 92 శాతం మంది ఇండ్లలోనే ఉంటూ తగిన మందుల వాడకం ద్వారా కోలుకుంటున్నారని, 8 శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని నిపుణులు అంచనా వేశారు. సకాలంలో వ్యాధిని గుర్తించడం, వ్యాధి తీవ్రత పెరగక ముందే ఆసుపత్రుల్లో చేరితే ఎటువంటి ప్రమాదం ఉండదని కొవిడ్‌ చికిత్సలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు చెబుతున్నారు.

సీరియస్‌ కండీషన్‌లో చేరిన వారిలో కూడా, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు కోలుకునేందుకు సమయం ఎక్కువ పడుతుందని, ఇతరులు వేగంగా కోలుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. ప్రస్తు త పరిస్థితుల్లో రెండో దశ వ్యాప్తి వేగాన్ని తట్టుకునేందు కు ప్రజలు మరింత అప్రమత్తం కావాలని, తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం ఉన్న వారు మాత్రం దవాఖానలో చేరాలని సూచిస్తున్నారు. సాధారణ వ్యాధి లక్షణాలున్న వారు మాత్రం ఇళ్లల్లోనే ఉం టూ సలహాలతో మందులు వాడి కరోనా నుంచి బయటపడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

20 నుంచి 40 వయస్సు వారు బాధ్యతగా ఉండాలి

  • మన రాష్ట్రంలో నమోదవుతున్న రెండో దశ కరోన పాజిటివ్‌ కేసుల్లో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు అధికంగా ఉన్నట్లు వైద్య శాఖ అంచనాలు చెబుతున్నాయి.
  • ప్రస్తుత పరిస్థితులు, కేసుల నమోదు సంఖ్య లో 40 శాతం వరకు ఈ వయసు వారు ఉండటం కొంత కలవరానికి గురి చేస్తున్నదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • 20 నుంచి 40 మధ్య వయసు వారు మరింత బాధ్యతగా మసలుకోవాలని, జాగ్రత్త చర్యలను కచ్ఛితంగా పాటించాలని వారు సూచిస్తున్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వేగంగా కోలుకుంటున్నారు

ట్రెండింగ్‌

Advertisement