e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home టాప్ స్టోరీస్ కోఠిలోనూ కొవిడ్‌ సేవలు

కోఠిలోనూ కొవిడ్‌ సేవలు

కోఠిలోనూ కొవిడ్‌ సేవలు
  • సుల్తాన్‌ బజార్‌ ప్రసూతి దవాఖానలో 150 పడకలు
  • అన్ని ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్‌ఎంసీ, దవాఖాన పాలక వర్గం
  • గర్భవతుల సేవలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం..
  • ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్‌ కె.రాజ్యలక్ష్మి

సుల్తాన్‌బజార్‌, మే 9: కరోనా రోగులకు పూర్తిస్థాయిలో సేవలందిస్తున్న గాంధీ, కింగ్‌కోఠి, టిమ్స్‌ దవాఖానలతో పాటు నగరంలో మరిన్ని చోట్ల ఈ సేవలను విస్తృతం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికకు తగినట్టుగా సుల్తాన్‌బజార్‌ ప్రసూతి వైద్యశాల కూడా సిద్ధమైంది. ఇక్కడ కూడా అన్ని వసతులతో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. గర్భవతుల వైద్యానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కొవిడ్‌ సేవల కోసం అదనపు వసతులు ప్రారంభించనున్నారు. దవాఖానలోని నూతన భవనంలో కొవిడ్‌ రోగులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించే పనులను ప్రారంభించారు. భవనంలోని జీ ప్లస్‌, మొదటి, రెండు, మూడో అంతస్తులలో పడకలు, ఆక్సిజన్‌ సరఫరాకు అవసరమయ్యే సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

నాలుగంతస్తుల్లో..

150 పడకలతో ఏర్పాటు చేయనున్న ఈ వసతి కోసం జీహెచ్‌ఎంసీ, దవాఖాన పాలకవర్గం సమన్వయంతో పని చేస్తున్నాయి. అయితే భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 40 పడకలతో ఐసీయూను, 20 ఆక్సిజన్‌, 20 సీ ప్యాక్‌ వెంటిలేటర్ల పడకలను, మొదటి అంతస్తులో 40 పడకలు, రెండో అంతస్తులో 10, మూడో అంతస్తులో 40 పడకలను అందుబాటులోకి తెస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.రాజ్యలక్ష్మి తెలిపారు. అయితే భవనంలో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తి అయినా ప్లాంట్‌ లేకపోవడంతో ప్రస్తుతం సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ అందించాలని యోచిస్తున్నామని ఆమె అన్నారు.

గర్భవతులకు ఇబ్బందులు రాకుండా..

  • ప్రసూతి దవాఖానకు నిత్యం వైద్య పరీక్షలు, ప్రసవాల కోసం వచ్చే గర్భవతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యాధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
  • ఓపి, అడ్మినిస్ట్రేషన్‌ భవనానికి మధ్యలో నూతన భవనం ఉండటం.. ఈ నూతన భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లేబర్‌ రూం ఉండటంతో దాన్ని పాత భవనంలోకి మార్చేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
  • అంతేకాక గర్భవతులు కొవిడ్‌ కేంద్రం వైపు రాకుండా ఉండేందుకు పాత భవనం, ఓపీ వైపు బారికేడ్లు పెట్టే ఆలోచనలో ఉన్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కోఠిలోనూ కొవిడ్‌ సేవలు

ట్రెండింగ్‌

Advertisement