బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 01:32:58

ప్రియుడుతో కలిసి ప్రియురాలు రైలుకు ఎదురెళ్లి...

ప్రియుడుతో కలిసి ప్రియురాలు రైలుకు ఎదురెళ్లి...

గౌతంనగర్‌: వివాహేతర సంబంధం నేపథ్యంలో... ప్రియురాలు, ప్రియుడు ఇద్దరూ కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.  మల్కాజిగిరి  ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ కథనం ప్రకారం.. మల్కాజిగిరి ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్న డ్రైవర్‌ ఎం.శంకర్‌, సంతోషి(29) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. కాగా.. పెండ్లికి ముందే సంతోషి, మీర్జాల్‌గూడకు చెందిన ఎస్‌. రవికుమార్‌(35) స్నేహంగా ఉండేవారు. రవికుమార్‌కు రెండేండ్ల క్రితం పెండ్లి కాగా.. ఇద్దరు పిల్లలు. సంతోషి, రవికుమార్‌ల మధ్య మూడేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నది.

 ఈ విషయంలో  సంతో షి, శంకర్‌ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. మంగళవారం కూడా గొడవ జరిగింది. దీంతో తన చావుకు ఎవరూ బాధితులు కాదంటూ .. పిల్లలను మంచిగా చూసుకోవాలని కోరుతూ సూసైడ్‌నోటు రాసి మధ్యాహ్నం సంతోషి బయటకు వెళ్లిపోయింది. భర్త మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే సంతోషి.. ప్రియుడు రవికుమార్‌తో కలిసి మంగళవారం చేగుంట మాసాయిపేట రైల్వే సమీపంలో రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. 


logo