పేదలకు కార్పొరేట్ వైద్యం

- కార్పొరేట్ దవాఖానలు సేవా దృక్పథంతో పనిచేయాలి
- మంత్రి ఈటల రాజేందర్
ఖైరతాబాద్, డిసెంబర్ 2 : ఆరోగ్య తెలంగాణ దిశగా, ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమాజిగూడలోని వివేకానంద దవాఖాన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉచిత ఆర్థో, క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను ఏర్పాటు చేశారు. శిబిరాలను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి పనిచేసే వారికి క్యాన్సర్ లాంటి రోగాలంటే కూడా తెలియవని, మధుమేహం, రక్తపోటు అనేవి రిచ్ మాస్ డిసీజ్లుగా చెప్పే వారని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని, పేద, ధనిక అని తేడా లేకుండా దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయన్నారు. డబ్బు ఉన్న వారు లక్షలైనా ఖర్చు పెట్టుకుంటున్నారని, కానీ పేదల జీవితాలు మాత్రం కోలుకోకుండా పోతున్నాయన్నారు.
క్యాన్సర్ లాంటి రోగాలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఇలాంటి రోగాల బారిన పడితే ఆదుకునేందుకు ప్రైవేట్ దవాఖానలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని, వివేకానంద దవాఖాన కూడా ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. దవాఖాన సిల్వర్ జూబ్లీని పురస్కరించుకొని ఫ్రీ క్యాన్సర్ చికిత్స, మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స కోసం శిబిరాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తే గుర్తు పెట్టుకుంటారని, వైద్య రంగంలో సేవలందిస్తే జీవితకాలం వారిని గుండెల్లో పెట్టుకుంటారని, వివేకానంద దవాఖాన అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో దవాఖాన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా, డైరెక్టర్లు డాక్టర్ రాజశేఖర్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- 18 వరకు మహారాష్ట్రలో టీకా నిలిపివేత. కొవిన్ వల్లే?!
- రామునిపట్ల వద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్‌ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..