అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కానున్నాడు. ఇప్పటికే కోవిడ్ ఎఫెక్ట్‌తో విశ్రాంతి తీసుకున్న బన్నీ..ఇక నుంచి స్పీడు పెంచేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో పుష్ప షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు. బన్నీ మరోసారి బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. బన్నీతో సరైనోడు చిత్రాన్ని నిర్మించిన గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీని తెరకెక్కించనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
అల్లు అర్జున్ కోసం బోయపాటి సాలిడ్ సబ్జెక్టును రెడీ చేయగా..గతంలో ఎన్నడూ చూడని విధంగా బన్నీని సరికొత్త అవతారంలో చూపించబోతున్నట్టు టాక్. అల్లు అర్జున్ మరోవైపు కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న పుష్ప చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!