గురువారం 28 జనవరి 2021
Hyderabad - Aug 18, 2020 , 23:06:28

ప్లెక్సీ విషయంలో వివాదం

ప్లెక్సీ  విషయంలో వివాదం

సోషల్‌ మీడియాలో రచ్చ...

ఇరువర్గాల పరస్పర దూషణలు, ఫిర్యాదులు

మూడు కేసుల్లో ముగ్గురు అరెస్ట్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఓ ప్లెక్సీ విషయంలో మొదలైన వివాదం.. సోషల్‌మీడియా లో రచ్చకెక్కి... రెండు వర్గాల మధ్య పరస్పర దూషణలకు దారి తీసింది. దీనిపై ఇరువర్గాలు   సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదులు చే శారు. దీంతో బీజేపీ అనుబంధ సంస్థలకు చెంది న ఇద్దరితో పాటు ఎంబీటీకి చెందిన నాయకుడి ని సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు కథనం ప్రకా రం.... పంద్రాగస్టు సందర్భంగా ఎంజే మార్కెట్‌ వద్ద బీజేపీ నాయకుడు లడ్డూయాదవ్‌ ఒక ప్లెక్సీ ని ఏర్పాటు చేశాడు. ఆ ప్లెక్సీ అభ్యంతరకరంగా ఉందంటూ  ఎంబీటీ ప్రధాన నాయకుడు అమ్జదుల్లాఖాన్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించారు. ఈ నేపథ్యం లో లడ్డూయాదవ్‌కు సంబంధించిన వాళ్లు ఫేస్‌బుక్‌లో కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారంటూ అమ్జదుల్లాఖాన్‌ డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో లడ్డూయాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే తనతో పాటు హిందుమతాన్ని కించపరిచే విధంగా సోషల్‌మీడియా లో పోస్టులు పెట్టారంటూ లడ్డూయాదవ్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో  కేసు నమోదు చేశారు. ఈ కేసులో యాఖత్‌పురాకు చెందిన ఇ క్బాల్‌ ఆసిఫ్‌ను అరెస్ట్‌ చేశారు.  ఇదిలాఉండగా... అమ్జదుల్లాఖాన్‌ సైతం తనతో పాటు తన మతాన్ని కించపరిచే విధంగా సోషల్‌మీడియాలో  ప్రచారం చేశారంటూ రెండు వేరు వేరు ఫిర్యాదులు చేయడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి.. బీజేపీ నేత రాంసాకేత్‌సింగ్‌, తెలంగాణ గోరక్షక్‌ సంస్థ అధ్యక్షుడు దీపక్‌ అలియాస్‌ కాలుసింగ్‌ను అరెస్ట్‌ చేశారు.


logo