మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Jul 15, 2020 , 22:38:31

కరోనా కట్టడికే ‘నియంత్రణలు’

కరోనా కట్టడికే ‘నియంత్రణలు’

- అంబర్‌పేటలో పలుచోట్ల కంటైన్మెంట్‌  జోన్‌ ఏర్పాటు - నియంత్రిత ప్రాంతాలను సందర్శించిన నోడల్‌ అధికారి 

అంబర్‌పేట : కరోనా కట్టడి కోసమే మళ్లీ కంటైన్మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌(ఫైనాన్స్‌), అంబర్‌పేట సర్కిల్‌ నోడల్‌ అధికారి జయరాజ్‌ కెన్నడి అన్నారు. మంగళవారం అంబర్‌పేటలో జీహెచ్‌ఎంసీ అధికారులు మళ్లీ కంటైన్మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. వీటిని బుధవారం డీసీ వేణుగోపాల్‌, ఏఎంఓహెచ్‌ హేమలతతో కలిసి నోడల్‌ అధికారి పరిశీలించారు. అంబర్‌పేట డివిజన్‌ పటేల్‌నగర్‌, చిలుకమ్మగల్లీ, బర్కత్‌పుర సాయి సురభి అపార్ట్‌మెంట్‌, శంషీర్‌నగర్‌ ప్రాంతాల్లో అధికారులు కంటైన్మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఒక్కో ఇంట్లో నాలుగైదు కేసులు ఉండటంతో వీటిని ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ మొదట్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఇంటి నుంచి బయటకు రాకుండా, బయటి వారు ఆ గల్లీ, బస్తీకి వెళ్లకుండా ఉండేందుకు నియంత్రణ ప్రాంతాలు ఏర్పరచి గట్టి పోలీసు బందోబస్తు పెట్టారు. తర్వాత సడలింపులు ఇవ్వడంతో పాజిటివ్‌ కేసు వచ్చిన ఇంటికే నియంత్రణను పరిమితం చేశారు. కేసులు పెరుగడంతో మళ్లీ నియంత్రణ ప్రాంతాలను నెలకొల్పారు. ఆ బస్తీకి చెందిన వారిని బయటకు రాకుండా కట్టడి చేశారు. వారికి కావాల్సిన నిత్యావసర  సరుకులను అందించేందుకు పారిశుధ్య విభాగానికి చెందిన ఎస్‌ఎఫ్‌ఏలను నియమించారు. అయితే వీటి ఏర్పాటుపై నోడల్‌ అధికారి జయరాజ్‌ కెన్నడి అంబర్‌పేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంత్రిత ప్రాంతాల ఏర్పాటు బాగుందన్నారు. కరోనా కట్టడి చేయడానికే మళ్లీ వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 


logo