సోషల్ మీడియాపై నిరంతర పర్యవేక్షణ

- లక్షల్లో పోస్టుల వీక్షణ
- 388 పోస్టుల తొలగింపు
- సీపీ ఆదేశాలతో మానిటరింగ్
హైదరాబాద్ : సోషల్ మీడియా ద్వారా మత ఘర్షణలకు ప్రేరేపించాలని చూస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్తా.. మీ పోస్టులను రాచకొండ ఐటీ సెల్ బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఆధునిక టెక్నాలజీతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రాజకీయ ద్వేషానికి పురిగొల్పే మాటలు, ఇంకా ఇతర పోస్టులను 24 గంటలపాటు పరిశీలిస్తున్నారు. వాటిని గుర్తించేందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ టూల్స్ ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి బృందం ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్, యూట్యూబ్ తదితర వేదికల్లో వస్తున్న పోస్టులను విశ్లేషిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తు ఉద్రిక్తలకు దారి తీసే వాటిని గుర్తించి వెంటనే తొలగిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 388 అభ్యంతకర, రాజకీయ దుమారం లేపే వీడియోలు, ఆడియోలు, పోస్టులను తీసేశారు. ఇలాంటి పోస్టులు పెడుతున్న యూజర్ల ఐపీ అడ్రస్‌లను గుర్తిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే అభ్యంతకర పోస్టులు పెట్టేవారిని అరెస్టు చేస్తామని ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. ఒక రోజు కొన్ని లక్షల పోస్టులు, వీడియోలు, ఆడియోలను ఐటీ సెల్ బృందం నిరంతరం పరిశీలిస్తున్నది. పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పర్యవేక్షణలో సోషల్ మీడియా మానిటరింగ్ నడుస్తున్నదని శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
- భారత రాజకీయ చరిత్రలో ఆయనదో పేజీ..
- చుక్కలు చూపించిన శార్దూల్, సుందర్.. టీమిండియా 336 ఆలౌట్
- కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు షురూ..
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
- ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
- బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
- ఆచార్యలో ‘సిద్ధ’గా రాంచరణ్.. లుక్ రివీల్
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్