హైదరాబాద్ : నియోజకవర్గంలోని గ్రౌండ్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్ నెహ్రూనగర్‌లోని జీహెచ్ఎంసీ గ్రౌండ్లో నెలకొన్న సమస్యలను గోల్నాక డివిజన్ అధ్యక్షుడు భరత్‌రాజ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి ఎమ్మెల్యే కాలేరుకు వివరించారు. అనంతరం ఎమ్మెల్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రౌండ్ల అభివృద్ధికి కృషి చేస్తానని, గ్రౌండ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి యువకులు వివిధ క్రీడలను ఆడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వన్నుట్లు తెలిపారు.
పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కరానికై బాధ్యతగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే అధికారులు వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో దొర్నాల యాదగిరి, భరత్ ముదిరాజ్, కాలేరు రామకృష్ణ, రాజన్, కాలేరు రాజు,లోకనాధం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అన్‌లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్‌లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?