గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 07:29:57

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి

వెంగళరావునగర్‌: జూబ్లీహిల్స్‌ నియోజవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. శుక్రవారం డివిజన్‌ పరిధిలోని కల్యాణ్‌ నగర్‌ వెంచర్‌-1లో రూ.కోటి 39లక్షలతో నిర్మిస్తున్న కాలనీ పార్కు నిర్మాణ పనులను జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. కాలనీవాసులకు ఆహ్లాదనం, ఆరోగ్యం కోసం కోటి 39 లక్షలు వెచ్చించి పార్కును సుందరీకరిస్త్నుట్లు తెలిపారు. పార్కులో గ్రీనరీతో పాటు రంగురంగుల పూలమొక్కలు, వాకింగ్‌ ట్రాక్‌, ఆటవిడుపు కోసం ఆటవస్తువులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా అనేక పార్కులను అభివృద్ధి పరుచినట్లు ఆయన ఈ సదంర్భంగా వెల్లడించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షురాలు దేదీప్య రా వు, జీటీఎస్‌ ఆలయ చైర్మన్‌ బోడ రాంచందర్‌, మాజీ కార్పొరేటర్‌ శ్యామ్‌ ముదిరాజ్‌, వేణుగోపాల్‌ యాదవ్‌, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.