ప్యోంగ్యాంగ్ : ఉత్తర కొరియా కదలికలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దీనికంతటికి ప్రధాన కారణంగా ఆ దేశం జలాంతర్గామి సిద్ధం చేయడమే. దాని అణు సంపన్న క్షిపణి అమెరికాను భయాందోళనలను గురిచేస్తున్నది.
ఒక వైపు ప్రపంచం కరోనా మహమ్మారి సంక్షోభంతో పోరాడుతుండగా, మరోవైపు ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని విస్తరించుకోవడంలో నిమగ్నమై ఉన్నది. జలాంతర్గామి నుంచి ప్రయోగించే అణు సంపన్న బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా త్వరలో పరీక్షించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడు వేల టన్నుల బరువున్న జలాంతర్గామిలో మూడు క్షిపణులను మోహరించే వీలున్నట్లు తెలుస్తున్నది. పసిఫిక్ మహాసముద్రం నుంచి గువామ్, హవాయి, అమెరికాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.
ప్యోంగ్యాంగ్ యొక్క ఈ చర్యలు ఈశాన్య ఆసియా, యునైటెడ్ స్టేట్స్ పరిస్థితికి ముప్పుగా భావిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ థింక్-ట్యాంక్ అయిన ది సైమన్స్ సెంటర్ నిపుణులు ఉత్తర కొరియా షిన్పో షిప్‌యార్డ్‌లో చాలాకాలంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. 2019 జూలైలో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ షిన్పో షిప్‌యార్డ్‌ను సందర్శించిన తర్వాత జలాంతర్గామి ఫొటోను అధికారులు విడుదల చేశారు. నిర్మాణ స్థలంలో గతంలో సరుకులు ఉన్న స్థలం కూడా ఖాళీగా మారినది ఫొటోలో కనిపిస్తున్నది.
అణుశక్తితో పనిచేసే పుక్‌గుక్సన్-3 క్షిపణికి 1,900 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. జలాంతర్గామి 1950 ల సోవియట్ డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, క్షిపణి ప్రయోగ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడింది. అమెరికాపై దాడి చేయాలంటే ఈ జలాంతర్గామి 12 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాని మొత్తం సామర్థ్యం ఏడు వేల కిలోమీటర్లే. ఇది నీటిలో దిగిన వెంటనే దాని వార్తలు ప్రపంచానికి తెలిసిపోతాయి.
ఇలాఉండగా, ఉత్తర కొరియాకు పసిఫిక్ మహాసముద్రం లోతు, వాతావరణం, తరంగాల బలం తెలుసుకోవడానికి ఎలాంటి మార్గం లేదు. జలాంతర్గామి సముద్రంలో తిరుగుతూ ఉంటే కొరియా కూడా దానిని కనుగొనలేకపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
రాజస్థాన్ జైలు నుంచి ఖైదీలు పరారీ
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
భారత ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్.. చరిత్రలో ఈరోజు
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
గర్భంతో ఉన్నా.. మండుటెండ, కరోనాను లెక్కచేయకుండా విధుల్లో డీఎస్పీ.. వీడియో వైరల్
వీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలన విషయాలు
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..