గురువారం 28 జనవరి 2021
Hyderabad - Nov 29, 2020 , 07:01:28

కుల,మతాల వ్యాఖ్యలు ప్రమాదకరం

కుల,మతాల వ్యాఖ్యలు ప్రమాదకరం

ఖైరతాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో 400 ఏండ్ల సుహృద్భావ వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య లౌకికవాదులు, జర్నలిస్టులపై ఉన్నదని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కే శ్రీనివాస్‌ అన్నారు. ‘ఎన్నికల్లో కుల, మత, ప్రాంతాల ప్రస్తావన అవసరమా?’ అనే అంశంపై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మైనార్టీ జర్నలిస్టు ఫ్రంట్‌ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ప్రజల మధ్య విచ్ఛినకర వాతావరణాన్ని సృష్టించే కుట్ర జరుగుతున్నదని అన్నారు. అలయ్‌బలాయ్‌ సంస్కృతి తిరిగి వర్ధిల్లేందుకు అన్నిపార్టీలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టులు కృషిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. టీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి విరాహత్‌ అలీ, టీయూడబ్ల్యుజే ఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బసవ పున్నయ్య, టీయూడబ్ల్యుజే(హెచ్‌143) ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్‌, సామాజికవేత్త డాక్టర్‌ రషీద్‌, మైనార్టీ జర్నలిస్టు ఫ్రంట్‌ అధ్యక్షుడు యూసుఫ్‌బాబు, కార్యదర్శి షరీఫ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆజంఖాన్‌, ఉపాధ్యక్షుడు అగస్టిన్‌, ప్రధాన కార్యదర్శి షఫీ, డీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


logo