హైదరాబాద్ : అంబర్ పేటలోని లకోటియా ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పాఠశాల లు తెరుచుకోనుండటంతో ఏర్పాట్లను పరిశీలించారు. పాఠశాల కు అవసరమైన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు.