శనివారం 31 అక్టోబర్ 2020
Hyderabad - Sep 27, 2020 , 01:16:02

అత్యవసర సమయాల్లో సీఎంఆర్‌ఎఫ్‌ వరం

అత్యవసర సమయాల్లో సీఎంఆర్‌ఎఫ్‌ వరం

గోల్నాక: అత్యవసర సమయాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన యాదగిరికి రూ. 60వేలు, కాచిగూడ కృష్ణానగర్‌కు చెందిన ఓంప్రకాశ్‌కు రూ. 30వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.