కేరళ: సాధారణంగా సినిమా నటులు డైరెక్టర్ సీన్ వివరించగానే తమ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. క్షణాల్లో ఏ మూడ్‌లోకి అయినా వెళ్లిపోతారు. అందులో పెద్దగా వింతేమీ ఉండదు. కానీ, కొందరు సినిమా నటులు కాకపోయినా నిజ జీవితంలో అద్భుతంగా నటిస్తారు. తాజాగా కేరళకు చెందిన ముగ్గురు జాతిరత్నాలు పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడానికి అలాంటి నటనా ప్రతిభనే కనబర్చారు. అందులో ఒక జాతి రత్నం నటన అయితే మహా అద్భుతం.
సీసీ కెమెరాల్లో రికార్డయిన వారి నటనకు సంబంధించిన వీడియోను కేరళ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమాయకుడిలా నటిస్తున్న ఈ బ్రదర్‌ను చూడండి అంటూ ఆ పోస్టుకు ఒక క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కేరళ పోలీస్ శాఖ తమ ఫేస్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియోలో కేరళ జాతిరత్నాల నటన చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఆ వీడియోకు కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ సెటైరికల్ కామెంట్స్, బ్యాక్ గ్రౌండ్ కూడా జోడించడంతో స్పీడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే గత గురువారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు ఒకే స్కూటీపై వెళ్తూ ఎదురుగా పోలీస్ వ్యాన్ రావడం గమనించారు. ఆ ముగ్గురిలో ఒక్కరికి కూడా మాస్కు లేకపోవడమేగాక, స్కూటీ నడుపుతున్న వ్యక్తికి హెల్మెట్ కూడా లేకపోవడంతో పోలీసుల చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఒక వ్యక్తి స్కూటీ దిగి పరుగందుకోగా మరో వ్యక్తి స్కూటీ దిగి, అప్పటికప్పుడు ముఖానికి మాస్కు పెట్టుకుని ఏమీ ఎరుగనట్టు రోడ్డుపై నడుస్తున్నాడు. స్కూటీ నడుపుతున్న వ్యక్తి కూడా స్కూటీని రివర్స్ తీసుకుని పారిపోయాడు. పోలీసులు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి పక్కనే వ్యాన్‌ను ఆపి ఇప్పుడు స్కూటీపై నుంచి దిగావు కదా అని ప్రశ్నించగా.. అబ్బే తాను కాదని బుకాయించాడు. పోలీసులు వెళ్లిపోవడంతో హమ్మయ్య బతికిపోయా అనుకున్నాడు. కానీ సీసీ కెమెరాలో అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు ఆ ఫన్నీ వీడీయోను వైరల్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు
నటుడు సోనూసూద్‌కు కరోనా పాజిటివ్
వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసా..?
కోవిడ్‌పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!