ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 12, 2020 , 00:37:48

పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కృషి

పేదల ఆరోగ్య  పరిరక్షణకు సీఎం కృషి

 ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి 

చర్లపల్లి : పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యం బారిన పడి చికిత్స పొందిన చర్లపల్లి డివిజన్‌కు చెందిన కిషన్‌, పరమేశ్‌, సూర్యవంశీ, అఖిల్‌లకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఆయన అందజేశారు. పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరంలాంటిదన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు గ్రేటర్‌ పరిధిలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి నాగిళ్ల బాల్‌రెడ్డి, నాయకులు జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, బుచ్చన్నగారి శ్రీకాంత్‌రెడ్డి, రాఘవరెడ్డి, మేకల మధుసూదన్‌రెడ్డి, శాగ రవీందర్‌, గరిక సుధాకర్‌ పాల్గొన్నారు. logo