గురువారం 28 జనవరి 2021
Hyderabad - Nov 26, 2020 , 06:19:45

బ్రాహ్మణ సంక్షేమానికి సీఎం పెద్దపీట

బ్రాహ్మణ సంక్షేమానికి సీఎం పెద్దపీట

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/రామంతాపూర్‌: బ్రాహ్మణ  సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద పీట వేస్తున్నారని అర్చక , ఉద్యోగ, కార్యాచరణ సమితి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. రామంతాపూర్‌, సనత్‌నగర్‌లో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. సనత్‌నగర్‌లోని హనుమాన్‌ దేవాలయం వద్ద బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలంగాణ అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కనకంభట్ల వెంకటేశ్వర్లు శర్మ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు, కార్యాచరణ సమితి అర్చక అధ్యక్షులు పరాశరం రవీంద్రాచార్యులు, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాడూరి కృష్ణమాచారి, ప్రధాన కార్యదర్శి టి.రాజేశ్వర శర్మ, తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ... అర్చకుల అభివృద్ధి, బ్రాహ్మణ సంక్షేమ, ఆలయ అభివృద్ధి సబ్బండ వర్గాల, శ్రేయస్సు కొరకు నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌పై అవాకులు -చవాకులు పేలుతున్న నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, ఆర్చకులు గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ రంగారెడ్డి, కొండపాక సుదర్శనాచార్యులు, గణేష్‌ కులకర్ణి, గోపాల్‌ జోషి, కిషోర్‌ జోషి, నిప్పుంజ శర్మ, వెంకటేశ్‌, విజయేంద్ర, సత్యనారాయణాచార్యులు, ఫణి కుమార్‌ పాల్గొన్నారు.హబ్సిగూడలోని ఓ ఫక్షన్‌ హాల్‌లోనిర్వహించిన సమావేశంలో అర్చకులు, బ్రాహ్మణ కోసం ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు గట్టు శ్రీనివాసాచారి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే వెంకటేశ్వరశర్మ, నేతలు రవీంద్రాచార్యులు, కాటురి కృష్ణమూర్తి, చంద్రశేఖర్‌శర్మ, తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo