శనివారం 23 జనవరి 2021
Hyderabad - Nov 24, 2020 , 07:21:10

సీఎం కేసీఆర్‌ వరాలు.. నగర ప్రజల సంబరాలు

సీఎం కేసీఆర్‌ వరాలు..  నగర ప్రజల సంబరాలు

బేగంపేట్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల వారికి వరాలు ప్రకటించడంతో నగర ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. రాంగోపాల్‌పేట డివిజన్‌ రాష్ట్రపతి రోడ్డులో టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఇంచార్జ్‌ తలసాని సాయికిరణ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మ్యానిఫెస్టో సామాన్య ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉందని సాయికిరణ్‌ యాదవ్‌ అన్నారు.  బేగంపేట డివిజన్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్ర పటాలకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాలాభిషేకం చేశారు. బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ బస్తీలో కార్పొరేటర్‌ అభ్యర్ధి మహేశ్వశ్రీహరి, ఇంచార్జ్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌, ప్రస్తుత కార్పొరేటర్‌ తరుణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్‌ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని తెలిపారు.

ఇంటి బడ్జెట్‌ బ్యాలెన్స్‌ అవుతుంది

ఉచిత నల్లానీరు, సెలూన్స్‌కు ఉచిత విద్యుత్‌, సినిమావారికి రాయితీలు తదితర సంక్షేమ పథకాలు కరోనాతో కష్టపడుతున్న నగరజీవికి ఊరటనిచ్చే అంశాలు. ముఖ్యంగా స్త్రీలు తమ కుటుంబ బడ్జెట్‌ను ఇప్పుడు బ్యాలెన్స్‌ చేసుకునే అవకాశం కల్పించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజాపక్షపాతి. టీఆర్‌ఎస్‌కు ఓటువేసి నగర మ్యానిఫెస్టోకు మద్దతు తెలపాలి. మాటతప్పని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగర బంగారు భవితకు హామీ ఇస్తున్నది. ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కార్పొరేటర్లుగా ఎన్నుకోవాలి. మేయర్‌ పీఠంపై టీఆర్‌ఎస్‌ జెండాఎగురాలి. -బెల్లం మాధవి, సావిత్రీబాయిఫూలే ఆర్గనైజేషన్‌

ఉచిత నీరు సాహసోపేతం

సీఎం కేసీఆర్‌ ఏది చేసినా అది ఒక చరిత్ర అవుతుంది. ఏదైనా పథకం పేదలకు అక్కరకు వస్తుంది అనుకుంటే ఎన్ని కోట్లు అవసరం అయినా సరే అందులో లాభనష్టాలను చూసుకోకుండా ప్రజలకు అందించేస్తారు. నగరంలో నివసించే ప్రజలకు ఇరవై వేల లీటర్ల వరకు మంచినీరు సరఫరా చేయాలని నిర్ణయించడం అభినందనీయం. ఇది సాహసోపేతమైన నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల నగరంలోని 97 శాతం మందికి ఉచితంగా మంచినీరు అందే అవకాశం ఉంది. ఎప్పుడూ పేదల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.  -దుర్గెంపూడి సాంబిరెడ్డి, బాలాజీనగర్‌ కాలనీ అధ్యక్షుడు

సీఎం చాలా గ్రేట్‌

మొట్టమొదటిసారి గ్రేటర్‌ మ్యానిఫెస్టోను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మ్యానిఫెస్టో నగర వాసులకు శుభవార్త. డిసెంబర్‌ నెల నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా మంచినీటిని సరఫరా చేస్తాననడం ఆనందదాయకం. త్వరలోనే 24 గంటల మంచినీరు సరఫరా చేస్తాననే నిర్ణయం కూడా చాలా మంచిది. వాహనాల ట్యాక్సును రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీకి సమగ్ర చట్టం తీసుకొస్తానని చెప్పారు. సీఎం చాలా గ్రేట్‌. -సంజీవ, మల్లిఖార్జుననగర్‌

వాహన పన్ను రద్దు తీపికబురు

పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌ కల్పిస్తున్న వెసులుబాట్లు దేశానికే ఆదర్శం. బ్యాంకులలో రుణాలు తీసుకొని వాహనాలు నడుపుతూ కుటుంబాలను పోషించుకుంటున్న వారికి వాహన పన్ను రద్దుచేయడం తీపికబురు. దీనివల్ల ఆర్థిక భారం నుంచి వందలాది కుటుంబాలకు ఉపశమనం లభిస్తుంది. త్రైమాసిక పన్నులు చెల్లించేందుకు వాణిజ్య వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో వాహన పన్ను రద్దు గొప్ప నిర్ణయం. -చాణక్య చారి, మియాపూర్‌

పేదలకు వరం

నగరంలో మంచి నీటిని ఉచితంగా ఇస్తామనడం పేద ప్రజలకు వరం. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు వాహనాల ట్యాక్స్‌ తగ్గిస్తాననడం హర్షించతగ్గ విషయం. -పల్లె జంగయ్యగౌడ్‌, మీర్‌పేట


logo