శనివారం 24 అక్టోబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:46:46

సీఎం సహాయనిధి పేదలకు సంజీవని

సీఎం సహాయనిధి పేదలకు సంజీవని

 మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

 అమీర్‌పేట్‌ : అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సీఎం సహాయనిధి సంజీవని లాంటిదని మంత్రి తలసాని  శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను  24 మంది లబ్ధిదారులకు అందజేశారు. మారేడ్‌పల్లిలోని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కార్పొరేటర్లు ఎన్‌.శేషుకుమారి, అత్తెల్లి అరుణగౌడ్‌, ఉప్పల తరుణి, ఆకుల రూపలతో కలిసి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌, మంత్రి, కార్పొరేటర్లు, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 
logo