బుధవారం 25 నవంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 07:04:39

ప్లాస్మా దాతలకు అభినందనలు

ప్లాస్మా దాతలకు అభినందనలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  అవసరమైన వారికి ప్లాస్మా దానం చేసి తన మానవత్వాన్ని హైదరాబాద్‌ పోలీసులు మరోసారి నిరూపించారని సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. శుక్రవారం సిటీపోలీసులు, హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌(హెచ్‌సీఎస్‌సీ) సంయుక్తంగా ప్లాస్మా దాతలను శుక్రవారం నగర పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానించారు.కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారు కొవిడ్‌తో బాధపడుతున్న వారికి ప్లాస్మా దానం చేశారని, అందులో కొవిడ్‌-19 వారియర్స్‌ ముందున్నారన్నారు. నగర పోలీసులు ఏర్పాటు చేసిన ప్లాస్మా దాన కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఇప్పటికే 250 మంది నగర పోలీసులు ప్లాస్మాదానం చేశారని వారిని సీపీ ప్రశంసించారు. వీరితో పాటు సామాన్య పౌరులు కూడా ముందుకొచ్చి ప్లాస్మాదానం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీ చౌహాన్‌, జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి, హెచ్‌సీఎస్‌సీ అసోసియేట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.