e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News పౌరులే..పోలీస్‌.. !

పౌరులే..పోలీస్‌.. !

  • ఉల్లంఘనలపై ‘క్లిక్‌’..‘హాక్‌ ఐ’లో పోస్ట్‌
  • 17.03 లక్షలు మంది యాప్‌ యూజర్స్‌
  • గతేడాది 2.17 లక్షల డౌన్‌లోడ్‌లు..

ఓ మహిళ జూబ్లీహిల్స్‌ నుంచి నల్లకుంటకు క్యాబ్‌లో బయలుదేరింది. ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్‌ మీదుగా వాహనం ప్రయాణిస్తున్నట్లు భావించింది. డ్రైవర్‌ హైదర్‌గూడ నుంచి వెళ్లేందుకు అసెంబ్లీ ముందు నుంచి వెళ్తుండగా, ఆమెకు అనుమానం వచ్చి హాక్‌ఐలో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కింది. ఆమె ఫోన్‌ ట్రాక్‌ చేస్తూ.. వెళ్లిన పోలీసులు హైదర్‌గూడ జంక్షన్‌ వద్ద ఆ క్యాబ్‌ను ఆపారు. డ్రైవర్‌ టెన్షన్‌ పడుతూ సార్‌.. లిబర్టీ నుంచి ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుందని ఈ రూట్‌లో వచ్చానని, దురుద్దేశం లేదంటూ చెప్పాడు. బాధితురాలు మాత్రం తనకు ఆ ఒక్క రూటే తెలుసని.. ఈ మార్గం తెలియదని.. అందుకే సేఫ్టీ కోసం మీకు సమాచారం ఇచ్చానని, వెంటనే స్పందించివచ్చినందుకు కృతజ్ఞతలంటూ.. ఆనందం వ్యక్తం చేసింది.

4,218 పోస్టులు..

- Advertisement -

సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): అబిడ్స్‌కు చెందిన పవన్‌ తన బైక్‌కు నంబర్‌ ఫ్లేట్‌ సరిగా లేకపోవడంతో.. ఇష్టం వచ్చినట్లు దూసుకెళ్తున్నాడు. సిగ్నల్‌ను జంప్‌ చేసి వేగంగా వెళ్తుండటంతో ఓ పౌరుడు ఫొటో తీసి.. హాక్‌ ఐ ద్వారా పోలీసులకు చేరవేశాడు. పోలీసులు ఆ వాహనం నంబర్‌ సరిగా లేకపోవడంతో సందేహాస్పదమైన జాబితాలో చేర్చారు. రెండురోజులకు ఆ వెహికిల్‌ను ఆబిడ్స్‌ కూడలిలో పట్టుకొని చలాన వేశారు.

హాక్‌ఐతో సమస్యలకు చెక్‌

రాష్ట్రవ్యాప్తంగా హాక్‌ఐ సేవలు ప్రజలకు అందుతున్నాయి. నేరాలు జరిగినా.. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడినా.. పౌరులు ఈ యాప్‌ ద్వారా పోలీసుల దృష్టికి తెస్తున్నారు. సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. హాక్‌ఐతో పాటు ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పోలీసులు.. వెంటనే అవసరమైన వాటికి కేసులు నమోదు చేయడం, సమస్య పరిష్కరించడం చేస్తున్నారు. హాక్‌ఐ అనే మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రజలకు పోలీసులకు మధ్య అనుసంధానకర్తగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. మరోవైపు యాప్‌ను వాడుతున్న వారి సంఖ్య 17.03 లక్షలకు చేరింది. గతేడాది హాక్‌ఐలో సామాన్య ప్రజలు 4218 పోస్టులు పెట్టగా, 2.17 లక్షల డౌన్‌లోడ్‌లు అయినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొదటిసారిగా 2015లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ యాప్‌లో మహిళ భద్రతతో పాటు ఆపదలో ఉన్న వారికి వెంటనే పోలీసు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఎస్‌వోఎస్‌(సేవ్‌ అవర్‌ సోల్‌) సౌకర్యం ఉంది. దీని ద్వారా 6450 అలర్ట్స్‌ పోలీసులకు అందాయి.

నిరంతరం పర్యవేక్షణ

నేడు సోషల్‌మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యమైంది. ప్రజలు వీటి ద్వారా పంపించే ఫిర్యాదులు, సూచనలు, సలహాలను సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లోని ఐటీ సెల్‌ సిబ్బంది నిరంతరం పరిశీలిస్తుంటారు. ఉల్లంఘనలకు పాల్పడడమే కాకుండా, పోలీసులు తప్పిదాలు చేసినా.. కొందరు వాటి ఫొటోలు సైతం తీసి.. ఫిర్యాదులు చేస్తున్నారు. వచ్చిన ఫిర్యాదులను ఆయా పోలీస్‌స్టేషన్లకు, ఇతర విభాగాలకు పంపిస్తుంటారు.

సామాన్యులు పెట్టిన పోస్టుల వివరాలు

పోస్టులు సంఖ్య
ట్రాఫిక్‌ ఉల్లంఘనలు 1684
నేరాలకు సంబంధించినవి 2014
మహిళలపై జరిగిన నేరాలు 267
పోలీసులు చేసిన మంచి పనులు 72
పోలీసులకు సూచనలు 181
ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై .. 830

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement