Hyderabad
- Jan 18, 2021 , 05:31:08
VIDEOS
సిటిజన్ కాప్స్

- గస్తీకి రెడీ అంటూ ముందుకు..
- సైబరాబాద్‌లో సరికొత్త కమ్యూనిటీ పోలీసింగ్
- స్థానిక పౌరులతో కమ్యూనిటీ ఇంటర్వెన్షన్ టీమ్స్
- మేడ్చల్ ఠాణా పరిధిలో ప్రారంభం..
పోలీసులతో ప్రజలు చేతులు కలిపారు. దొంగతనాల నివారణకు తాము కూడా గస్తీకి సిద్ధమని ముందుకు వచ్చారు. దీంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ ఠాణా పరిధిలో కమ్యూనిటీ ఇంటర్వెన్షన్ టీమ్స్‌ను ప్రారంభించారు. ఈ బృందాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చే బాధ్యత కలిగిన పౌరులను పోలీసులు నమోదు చేస్తున్నారు. వారికి గస్తీల్లో నిర్వహించాల్సిన బాధ్యతలు, ఏం చేయాలనే విషయాలపై పోలీసు అధికారులు ముందస్తుగా వివరిస్తున్నారు.
గస్తీ ఎలా నిర్వహించాలి..!
రాత్రి సమయంలో గస్తీ తిరిగే పౌరులు ఎవరూ లాఠీలు, కర్రలు ఇతర వస్తువులను పట్టుకోవద్దు. కేవలం నలుగురు కలిసి తమ కాలనీల్లో తిరుగాలి. గస్తీలో విజిల్‌ను ఉపయోగించి దొంగలు రాకుండా అడ్డుకోవాలి. అర్ధరాత్రి సమయాల్లో ఎవరైనా కాలనీల్లోకి కొత్త వారు వచ్చినా.. అనుమానాస్పదంగా తిరిగినా వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసు స్టేషన్ లేదా బీట్ కానిస్టేబుళ్లకు సమాచారం అందించాలి. వారిని పట్టుకుని దాడి చేయొద్దు.
ముందుకు వచ్చిన 25మంది పౌరులు
ఈ బృందాల్లో చేరే పౌరులు పోలీసులకు వారి ఫొటోలతో పాటు ఐడీ ప్రూఫ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ముందస్తుగా పోలీసులు వారి గురించి పూర్తిగా సేకరించిన సమాచారంతో బృందాల్లో చేరుస్తారు. అయితే ఇప్పటి వరకు మేడ్చల్ ఠాణాలో దాదాపు 25మంది పౌరులు రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తామని ముందుకు వచ్చారు. ఈ కమ్యూనిటీ గస్తీ రాత్రి 11 నుంచి ఉదయం 4గంటల వరకు ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.
కమ్యూనిటీ గస్తీ ఎందుకంటే..
రాత్రి సమయాల్లో ప్రతి కాలనీల్లో పోలీసులు గస్తీ తిరగడం చాలా కష్టం. దీంతో ఒక కాలనీ ప్రాంతంలో పోలీసులు పది నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఉండలేకపోతున్నారు. అలా పోలీసులు వెళ్లిపోగానే దొంగలు పంజా విసురుతున్నారని ఇటీవల నమోదైన ఫిర్యాదులతో స్పష్టమైంది. దీంతో పోలీసు అధికారులు చోరీ జరిగిన సమయం, నైట్ బీట్, పోలీసు మొబైల్ పెట్రోలింగ్ గస్తీ సమయాన్ని విశ్లేషించుకుని ఓ ప్రయత్నంలో ఈ కమ్యూనిటీ ఇంటర్వెన్షన్ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చామని పోలీసు అధికారులు చెప్పారు.
తాజావార్తలు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం
- అక్షర్‌తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
MOST READ
TRENDING