మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:57:55

పర్యాటక అభివృద్ధికి సీఐఐ కృషి అభినందనీయం

పర్యాటక అభివృద్ధికి సీఐఐ కృషి అభినందనీయం

- మానవత్వానికి నిదర్శనం ‘కరోనా వారియర్స్‌' సేవలు  - టూరిజం, సాంస్కృతికశాఖ మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ 

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ : రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ కృషి అభినందనీయమని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా  కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ‘గ్రామీణాభివృద్ధి కోసం  వీకెండ్‌ టూరిజం హ్యాంగ్‌ అవుట్‌'లను ప్రోత్సహించడం’లో భాగంగా  ట్రావెల్‌ ఎగైన్‌   పేరుతో అనంతగిరి కొండలకు బైక్‌ రైడ్‌ని నిర్వహించారు. తారామతి బరదరి నుంచి అనంతగిరి కొండల వరకు  జరిగిన ఈ  బైక్‌రైడ్‌ని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ జెండా ఊపి  ప్రారంభించారు. అనంతరం స్వయంగా బైక్‌ నడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి కోసం  వీకెండ్‌ టూరిజం హ్యాంగ్‌ అవుట్లను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. సీఎం కేసీఆర్‌, పరిశ్రమశాఖ మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో పర్యాటక, పర్యావరణ వ్యస్థలను బలోపేతం చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దుర్గం చెరువును ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు.

తెలుగుయూనివర్సిటీ: ‘కరోనా వారియర్స్‌' సేవలు మానవత్వానికి నిదర్శనమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రవీంధ్రభారతి ప్రాంగణంలోని  మంత్రి కార్యాలయంలో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వలసకూలీలు, దినసరి కార్మికులు, నిరుపేదలకు సేవలందించిన సామాజికవేత్తలకు ఫిలాంత్రోపిక్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ అద్దంకి రాజా ఆధ్వర్యంలో కరోనా వారియర్స్‌ అవార్డులను ప్రదానం చేశారు. వారిలో డాక్టర్‌ అన్నం శ్రీనివాసరావు, డాక్టర్‌ ఎస్‌.పి భారతి, డాక్టర్‌ ఎం.గంగాధరరావు, డాక్టర్‌ షేక్స్రూల్‌, కె. శ్రీధర్‌రావు, కట్టా సుదర్శన్‌రెడ్డి, కట్టెల గణేశ్‌, ఎడ్ల మల్లేశ్‌ముదిరాజ్‌, టి. మధుసూదనరావు, డాక్టర్‌ సంధ్య, వనం భద్రాద్రి రామారావు, డాక్టర్‌  భవాని శంకర్‌, బోగి చందన,  నాగేందర్‌రాజు ఉన్నారు. 

వెయిట్‌ లిఫ్టర్‌కు సన్మానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి:  జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతాకాలు సాధించిన అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టర్‌ సుకన్య బాయిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తన చాంబర్‌లో సన్మానించారు.  


logo