e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home హైదరాబాద్‌ వారి కష్టం వారికే..

వారి కష్టం వారికే..

ఖైరతాబాద్‌, జూలై 4 : క్యాబ్‌ డ్రైవర్లు కార్పొరేట్‌ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. వచ్చిన లాభాల్లో కమీషన్లు చెల్లించాల్సిన అవసరం లేదు. రోజంతా తిరిగితే వచ్చిన లాభాలను వారే తీసుకోవచ్చు. క్యాబ్‌ డ్రైవర్లుగా సుధీర్ఘకాలంగా పనిచేసిన కొందరు ఔత్సాహికులు కొత్త యాప్‌ తీసుకువచ్చారు. ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న క్యాబ్‌ డ్రైవర్లు రోజు వారి కష్టం వారే తీసుకునేలా వీలు కల్పించారు. ‘ఛాయిస్‌ క్యాబ్స్‌ సర్వీసెస్‌’ పేరుతో రూపొందించిన యాప్‌, లోగో, బ్రోచర్లను ఆ సంస్థ డైరెక్టర్లు ఆర్‌.సత్యనారాయణ, నీలేశ్‌, శేఖరయ్య, అవినాశ్‌లు ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా క్యాబ్‌ డ్రైవర్లుగా పనిచేసిన అనుభవంతో వారు పడే కష్టాలను ప్రత్యక్షంగా చూశామన్నారు. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు వారి లాభాల్లో వాటాలు తీసుకుంటూ, కమీషన్లు సైతం దండుకుంటున్నాయన్నారు.

దీంతో చాలీచాలని డబ్బులతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడే వారన్నారు. తాము రూపొందించిన యాప్‌లో ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే 365 రోజులు 24/7 ఎన్ని ట్రిప్పులు, ఎక్కడికి వెళ్లినా వినియోగదారులు ఇచ్చే లాభాలు మొత్తం డ్రైవర్లే తీసుకోవచ్చన్నారు. తమ సంస్థకు ప్రతి నెల కొంత సబ్‌స్క్రిప్షన్‌ చెల్లిస్తే చాలని తెలిపారు. జీపీఎస్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుందని, తమ యాప్‌లో పోలీస్‌ స్టేషన్‌కు అనుసంధానంగా ఓ అప్షన్‌ను పెట్టామని, తద్వారా మహిళలకు నూటికి నూరు శాతం భద్రత కల్పిస్తున్నామన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి రేట్లలో వ్యత్యాసం లేకుండా ఏ సమయమైనా రేట్లు పెంచకుండా వినియోగదారులతో ఫ్రెండ్లీగా ఉండటం తమ యాప్‌ విశేషమన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement