సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jul 13, 2020 , 00:48:53

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

 రామంతాపూర్‌ : ముఖ్యమంత్రి సహాయనిధి పేదప్రజలకు వరంలాంటిదని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం రామంతాపూర్‌కు చెందిన నసీమాబేగంకు రూ.60వేలు, స్వాతికి 9వేలు, రాహుల్‌కు 7వేలు, పద్మకు 5.5వేలు, వామన్‌రావుకు 60వేల ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్వోసీ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 

హెచ్‌బీకాలనీలో హరితహారం..

 మల్లాపూర్‌ : హెచ్‌బీకాలనీ డివిజన్‌ వార్డు కార్యాలయం ఆవరణలో కార్పొరేటర్‌ గొల్లూరి అంజయ్య జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్‌ దేవేందర్‌రెడ్డి హాజరై మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. 


logo