సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 08:38:59

వృద్ధులే లక్ష్యంగా స్నాచింగ్‌లు

వృద్ధులే లక్ష్యంగా స్నాచింగ్‌లు

  • ఇద్దరు అరెస్ట్‌ ..8 తులాల బంగారు నగలు స్వాధీనం

శామీర్‌పేట : వృద్ధులనే లక్ష్యంగా చేసుకొని స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని శామీర్‌పేట పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 8 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  బాలానగర్‌ డీసీపీ పద్మజా వివరాలు వెల్లడించారు. కీసర మండలం, నారారంకు చెందిన బాలాజీ కుషాయిగూడ డిపోలో ప్రైవేటు డ్రైవర్‌. కాప్రా మండలం జమ్మిగడ్డకు చెందిన బి.పోచయ్య డ్రైవర్‌. ఈ ఇద్దరు  శివారు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలపై వెళ్తున్న వృద్ధులను టార్గెట్‌ చేసి.. చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇటీవల బాబాగూడలో, జగదేవ్‌పూర్‌లో స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఈ మేరకు శామీర్‌పేట, జగదేవ్‌పూర్‌ పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  కాగా.. గురువారం ఉదయం వారిద్దరు పల్సర్‌( టీఎస్‌08ఎఫ్‌వీ1382)పై  అనుమానాస్పదస్థితిలో వెళ్తుండగా బిట్స్‌ జంక్షన్‌ వద్ద శామీర్‌పేట పోలీసులు, ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా  పట్టుకున్నారు. విచారణలో స్నాచింగ్‌ల విషయం బయటపడింది. సమావేశంలో పేట్‌బషీర్‌బాగ్‌ ఏసీపీ నర్సింగ్‌రావు, సీఐ సంతోషం, ఎస్‌ఐలు సంజీవ, గణేశ్‌, రవి, సిబ్బంది పాల్గొన్నారు.