కొండాపూర్, ఆగస్టు 20 : హిందీ భాషాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హిందీ సలహా సంఘం సభ్యుడిగా నియమితులైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్య ఆర్ఎస్ సర్రాజు అన్నారు. శుక్రవారం వర్సిటీ హిందీ విభాగం, దళిత, ఆదివాసీ అధ్యయన, అనువాద కేంద్రం పరిశోధక విద్యార్థులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.