గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Nov 03, 2020 , 08:09:09

నిధుల కేటాయింపులో రాష్ట్రంపై కేంద్రం వివక్ష

నిధుల కేటాయింపులో రాష్ట్రంపై కేంద్రం వివక్ష

కందుకూరు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధుల కేటాయింపులో తెలంగాణ పట్ల వివక్ష చూపతుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు రాష్ర్టానికి కేటాయించిన నిధులు శూన్యమని ఆయన పేర్కొన్నారు. సోమవారం తన నిధుల నుంచి పలు గ్రామాలకు చెందిన 10మంది దివ్యాంగులకు 10మూడు చక్రాల వాహనాలను మంజూరు చేయగా, ఆ వాహనాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితాహరినాథ్‌రెడ్డితో కలిసి వారికి అందజేశారు. అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ పాలనను చూసి బీజేపీ రాష్ర్టాల ఎంపీలు మెచ్చకుంటున్నారని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ జ్యోతి పాండు, మార్కెట్‌ చైర్మన్‌ వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి,సర్పంచ్‌ మల్లారెడ్డి,గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ కార్యదర్శి యాదయ్య,సోషల్‌ మీడియా కన్వీనర్‌  దీక్షిత్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, పార్టీ అధ్యక్షుడు జయేందర్‌,పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.