శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 18, 2021 , 06:20:41

సీసీ కెమెరాలు పట్టించాయి..

సీసీ కెమెరాలు పట్టించాయి..

  • చెడువ్యసనాలు, ఆర్థికఇబ్బందులతో చోరీకి ప్లాన్‌
  • గతంలో కారుడ్రైవర్‌గా పనిచేసినయజమాని షాపునే టార్గెట్‌ పెట్టుకున్నాడు
  • అర్ధరాత్రి పైపులను పట్టుకుని..మూడు అంతస్తులు ఎక్కాడు...
  • గ్రిల్స్‌ తొలగించి..రూ.39లక్షలువిలువచేసే ఆభరణాలు చోరీ చేశాడు...
  • సీసీ కెమెరాలు దారిచూపించగా..24 గంటల్లో నిందితుడు అరెస్ట్‌

ఒకప్పుడు కారు డ్రైవర్‌.. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ‘చెత్త’ లారీకి తాత్కాలిక డ్రైవర్‌.. చెడువ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందులతో చోరీకి ప్లాన్‌ వేశాడు. ఇందుకు గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసినయజమానికి చెందిన బంగారం షాపును ఎంచుకున్నాడు... అర్ధరాత్రి పైపులను పట్టుకుని మూడో అంతస్తులో ఉన్న దుకాణానికి వెళ్లి గ్రిల్స్‌ తొలగించి.. దాదాపు రూ.39లక్షల విలువచేసే గిరివి పెట్టిన బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు... అయితే.. సీసీ కెమెరాలతో పోలీసులకు చిక్కాడు.. ఈ కేసును మార్కెట్‌ పోలీసులు 24 గంటల్లో చేధించారు.

బషీర్‌బాగ్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్‌ చోరీ కేసు వివరాలు వెల్లడించారు.. సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో అనిల్‌ జైన్‌ నేమిచంద్‌ జువెల్లర్స్‌, అనిల్‌ జైన్‌ పాన్‌ బ్రోకర్‌ వ్యాపారాన్ని  నిర్వహిస్తున్నాడు. సంక్రాంతి పండుగ రోజు దుకాణం తెరిచి.. సాయం త్రం 4.30 గంటలకు మూసివేసి ఇంటికి వెళ్లాడు. తిరిగి 15న ఉదయం రాగా దుకాణంలో దొంగలు పడ్డారని గుర్తించి.. దాదాపు రూ.39 లక్షల విలువ చేసే బంగా రం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారని యజమాని పో లీసులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు వెంటనే నిందితుల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.. సీసీ కెమెరాల దృశ్యాలను మ్యా పింగ్‌ చేసుకుంటూ వెళ్లగా.. అది బన్సీలాల్‌పేట, చాచా నెహ్రూ నగర్‌లోని మహ్మద్‌ ఆదిల్‌ ఇంటి వరకు తీసుకువెళ్లింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం మిస్టరీ వీడిపోయింది. అంతేకాకుండా చోరీ సొత్తు మొత్తం దొరికింది. విచారణలో నిందితుడు ఆదిల్‌ నేరచరిత్ర బయటపడింది. 

జువైననల్‌ నుంచే నేరాలబాట పట్టిన ఆదిల్‌.. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ‘చెత్త’ లారీకి తాత్కాలిక డ్రైవర్‌గా పని చేస్తున్నాడని గుర్తించారు. ఆదిల్‌ 2015 నుంచి 2017 వరకు అనిల్‌ జైన్‌ వద్ద కారు డ్రైవర్‌గా పని చేశాడని.. ఈ సమయంలో అనిల్‌చంద్‌ దుకాణానికి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకున్నాడని.. ఆ తర్వాత ఉద్యోగం మానేసి అప్పుడప్పుడు తాత్కాలిక డ్రైవర్‌గా అతడి వద్దకు వెళ్లేవాడని తెలిసింది. అతడి చెడు వ్యసనాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో.. అనిల్‌చంద్‌ దుకాణంలో చోరీ చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత పైపుల ద్వారా మూడో అంతస్తుకు వెళ్లి.. అక్కడ ఇనుప గ్రిల్స్‌ను తొలగించి దుకాణంలోకి వెళ్లాడు. అందులో ఉన్న దాదాపు రూ.39 లక్షల విలువ చేసే గిరివి పెట్టిన బంగా రం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన మార్కెట్‌ పోలీసులను సీపీ అంజనీకుమార్‌ అభినందించారు.

VIDEOS

logo