గురువారం 01 అక్టోబర్ 2020
Hyderabad - Jul 31, 2020 , 23:49:18

సీసీరోడ్డు పనులు ప్రారంభం

సీసీరోడ్డు పనులు ప్రారంభం

యూసుఫ్‌గూడ: జూబ్లీహిల్స్‌ నియోజక వర్గంలోని ప్రధాన రహదారులకు అంతర్గత రోడ్లను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తెలిపారు. శుక్రవారం డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్‌ బాబాఫసియుద్దీన్‌తో కలసి సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోరబండ డివిజన్‌లోని స్వరాజ్‌ నగర్‌లో రూ. 8 లక్షలు, బాబా సైలానీ నగర్‌-1లో రూ.18.25 లక్షలు,  సైట్‌-1లో 19.65లక్షలు,  సైట్‌-2లో రూ. 24.50 లక్షలతో పాటు వెంగళరావునగర్‌ డివిజన్‌లోని రాజీవ్‌ నగర్‌లో  పలు చోట్ల రూ. 49.20 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ మాట్లాడుతూ  ప్రజా సంక్షేమానికి కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. 

ముస్లింలకు బ్యాగులు అందజేత

 బక్రీద్‌ పండుగ సందర్భంగా  వ్యర్థాలను బ్యాగుల్లో వేయాలని డిప్యూటీ మేయర్‌  బాబాఫసియుద్దీన్‌ సూచించారు. శుక్రవారం బోరబండలో   ముస్లింలకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాగులు తీసుకోని ముస్లింలు సమీప మజీద్‌ల వద్దకు వెళ్లి  తీసుకోవాలన్నారు.  జీహెచ్‌ఎంసీ సిబ్బంది, మజీద్‌ కమిటీ పెద్దలు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo