సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 07:21:49

ఎస్సార్‌ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులుపై.. అదే పీఎస్‌లో కేసు నమోదు

ఎస్సార్‌ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులుపై.. అదే పీఎస్‌లో కేసు నమోదు

వెంగళరావునగర్‌ : ఎస్సార్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులుపై అదే పీఎస్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదయ్యింది. ఇలా ఒక పోలీసు స్టేషన్‌లో పని చేసే ఇన్‌స్పెక్టర్‌పై అదే పీఎస్‌ లో కేసు నమోదు కావడం అరుదుగా జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల బోరబండ, శ్రీరామ్‌నగర్‌కు చెంది న నీలం భార్గవరామ్‌(26) తనను ఎస్సార్‌ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు కులుంపేరిట దూషించారని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ఈ సంఘటనపై మానవ హక్కుల కమిషన్‌ ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్‌ సైదులుపై అదే పీఎస్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు అధికారిగా డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆజయ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం, రహ్మత్‌ నగర్‌ డివిజన్‌ ఇందిరానగర్‌లో 137 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో దేవతా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఖైరతాబాద్‌ తహసీల్దార్‌ సెప్టెంబరు 24న ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య విగ్రహాన్ని తొలగించి, ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేశారు. కాగా దేవాలయానికి చెందినదిగా పేర్కొని ఈ స్థలంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు జోక్యం కల్పించుకోవడంతో భార్గవరామ్‌ ట్విట్టర్‌ వేదికగా నిరసన వ్యక్తం చేశాడు. దీంతో భార్గంవరామ్‌తో పాటు అతని సోదరుడు రతన్‌కుమార్‌లను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ, తా ను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ వీడియోను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశాడు. అనంతరం గుర్తుతెలియని విషం తాగడంతో అస్వస్థతకు గురై ఈఎస్‌ఐ దవాఖానలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఈ వ్వవహారంలో భార్గవరామ్‌ మానవ హక్కుల కమిషన్‌ ఆశ్రయిచడం జరిగింది.