గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Jun 26, 2020 , 00:01:46

లైఫ్‌స్ప్రింగ్‌ దవాఖాన, డయాగ్నస్టిక్‌పై కేసు

లైఫ్‌స్ప్రింగ్‌ దవాఖాన, డయాగ్నస్టిక్‌పై కేసు

వనస్థలిపురం:వనస్థలిపురం లైఫ్‌స్ప్రింగ్‌ దవాఖాన, కార్తిక్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... మన్సూరాబాద్‌ డివిజన్‌ వినాయక్‌నగర్‌కు చెందిన  గోశిక ఉమ(22) గర్భం దాల్చిన నుంచి లైఫ్‌స్ప్రింగ్‌ దవాఖానలో చూపించుకుంటూ కార్తిక్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో పలుమార్లు స్కానింగ్‌లు చేయించుకుంది. ఆరోనెలలో తీసే టిప్పా స్కాన్‌లో కూడా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు. ఈనెల 22న దవాఖానలో ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా ఆ బిడ్డ ఎడమ చేయి సగమే ఉండడంతో అందరూ కంగుతిన్నారు. అన్ని స్కాన్‌లలో సరిగ్గా ఉన్నట్లు చెప్పిన వైద్యులు తమను తప్పుదోవ పట్టించారని, మోసం చేసిన లైఫ్‌స్ప్రింగ్‌  దవాఖాన,కార్తిక్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌పై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తమ బిడ్డను మార్చి ఉండవచ్చు అనే అనుమానాలను బాధిత కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు.