గురువారం 04 జూన్ 2020
Hyderabad - May 19, 2020 , 01:23:31

తూకంలో మోసం.. డీమార్ట్‌పై కేసులు

తూకంలో మోసం..  డీమార్ట్‌పై కేసులు

చర్లపల్లి: తూకంలో తేడా రావడంతో వినియోగదారుల ఫిర్యా దు మేరకు తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి.. కేసులు నమోదు చేశారు..  హెచ్‌బీకాలనీకి చెందిన నారాయణ చర్లపల్లి డివిజన్‌, కుషాయిగూడ, శివసాయినగర్‌లో ఉన్న డీమార్ట్‌లో సామగ్రిని కొనుగోలు చేశాడు. అయితే తూకంలో తేడా ఉన్నట్లు గుర్తించి ధర్నాకు దిగాడు. అనంతరం తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అధికారులు  డీమార్ట్‌లో తనిఖీలు చేపట్టి.. తూనికల్లో తేడా ఉన్నట్లు గుర్తించి.. సంబంధిత డిమార్ట్‌పై ఐదు కేసులు నమోదు చేసి, వేయింగ్‌ మిషన్‌, ఇతర సామగ్రిని సీజ్‌ చేశారు. తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ .. తుకా ల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.


logo