e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home హైదరాబాద్‌ కొత్తగా రంగులొచ్చెనా!!

కొత్తగా రంగులొచ్చెనా!!

కొత్తగా రంగులొచ్చెనా!!
  • వాహనాల రంగు మార్చేయండిలా..
  • కార్ల వ్రాపింగ్‌కు భలే క్రేజ్‌
  • నగరంలో విస్తరిస్తున్న సంస్కృతి
  • ఉపాధి పొందుతున్న యువత

మీ వాహనం రంగు మార్చాలనుకుంటున్నారా? పెయింట్‌ చేసేందుకు సమయం కేటాయించలేకపోతున్నారా? ఎక్కువ మొత్తం డబ్బులు అవుతాయని బాధ పడుతున్నారా? ఇక ఇబ్బంది పడాల్సిన పని లేదు. తక్కువ సమయంలోనే మీ వాహనం.. మీకు ఇష్టమైన రంగులో మార్చుకునే అవకాశం కల్పిస్తుంది వినైల్‌ వ్రాపింగ్‌. వ్రాపింగ్‌ ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. చాలా మంది కారు యజమానులు ఖరీదైన పెయింట్‌ జాబ్‌కు గుడ్‌బై చెప్పి, వినైల్‌ వ్రాపింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. కారు, బైక్‌లను మనకు నచ్చినట్లుగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాయి కార్‌ డెకార్స్‌. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్న వ్రాపింగ్‌ సంస్కృతి ఇప్పుడు మన హైదరాబాద్‌కు వచ్చేసింది.

కార్లు, బైక్‌లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలని చాలా మంది తాపత్రయ పడుతుంటారు. కానీ పెయింటింగ్‌ అంటే సమయం, డబ్బు వృథా అని మదన పడుతుంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా చేసింది వినైల్‌ వ్రాపింగ్‌. దేశంలోని ప్రధాన నగరాల్లో సంపన్నుల కార్లను ఆకర్షణీయంగా చేయడానికి కార్‌ డెకార్స్‌ నిపుణులు వ్రాపింగ్‌ను పరిచయం చేశారు. ఇప్పుడు ఈ వ్రాపింగ్‌ సంస్కృతి హైదరాబాద్‌ జోరందుకుంది. వ్రాపింగ్‌తోనే ఎంతో యువకులు జీవనోపాధి పొందుతున్నారంటే దీనికి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

వ్రాపింగ్‌ అంటే….

లక్షలు, కోట్లు పెట్టి కొనే కార్లు ,బైక్‌ల కంపెనీల నుంచి వచ్చే ఫీచర్స్‌తో అదరహో అనిపిస్తాయి. కానీ ఫీచర్స్‌ ఉంటే సరిపోదన్నట్లుగా కారు లోపల కాకుండా బయట ఆకర్షణీయంగా కనిపించాలని అభిరుచి కలవారూ ఉంటారు. వారి అభిరుచి తగ్గట్లుగా కార్ల రూపాన్ని అందమైన రంగు, రంగుల కాగితాలతో అద్భుతంగా మలచడమే వ్రాపింగ్‌. ఈ వ్రాపింగ్‌తో కంపెనీలు ఇచ్చే సాధారణ రంగులను మార్చేసి సుందరంగా తయారు చేస్తారు. కార్ల శ్రేణిని బట్టి 35వేల నుంచి లక్షా 50 వేల వరకు ఛార్జ్‌ చేస్తారు. ప్రస్తుతం నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, అమీర్‌పేట్‌, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, కోఠి, అబిడ్స్‌, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, అత్తాపూర్‌ తదితర ప్రాంతాల్లో కార్ల డెకార్స్‌, వ్రాపింగ్‌ నిపుణులు సేవలందిస్తున్నారు. అంతే కాకుండా పలువురు యువకులు యూట్యూబ్‌లో తమ పనితీరును వీడియోల రూపంలో పొందుపరచి ఇండ్ల వద్దనే వ్రాపింగ్‌ చేస్తూ ఉపాధిని పొందుతున్నారు.

వాహనాలు విభిన్నంగా కనిపించడానికి వేయించుకుంటాం

అందరి వాహనాల మాదిరి కాకుండా విభిన్నంగా కనిపించడానికి వ్రాపింగ్‌ బాగుంటుంది. వ్రాపింగ్‌తో కార్లు, బైక్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే దీనిని చేయించుకుంటాం. ఖర్చుకు వెనుకాడకుండా కార్లకు, బైక్‌లకు వ్రాపింగ్‌ చేయించుకుంటాం. -పృథ్వీ

వ్రాపింగ్‌తో ఉపాధి

ఆధునిక కార్లను ఆకర్షణీయంగా మలచడానికి వ్రాపింగ్‌ ఎంతో దోహదం చేస్తుంది. వ్రాపింగ్‌ పనితో ఉపాధిని పొందుతున్నాం. లక్షల రూపాయలతో దుకాణాలను పెట్టుకోలేని వారు తమ పనితీరును వీడియోల రూపంలో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి వ్రాపింగ్‌ పనిని పొందుతున్నారు. నగరంలో ఎంతో మంది యువకులు వ్రాపింగ్‌తో స్వయం ఉపాధిని, పేరును సంపాదిస్తున్నారు. – సందుపట్ల పవన్‌ (మెహిదీపట్నం)

Advertisement
కొత్తగా రంగులొచ్చెనా!!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement