హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 10లో వేగంగా వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్లో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్.. తక్షణమే కారును ఆపి బయటకు దిగేశాడు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు నంబర్ – ఏపీ 25 ఏడీ 2527.