శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Jun 19, 2020 , 00:51:06

సికింద్రాబాద్‌లో సింగపూర్‌ అందాలు

సికింద్రాబాద్‌లో సింగపూర్‌ అందాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/మారేడ్‌పల్లి: చారిత్రాత్మక సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలు మరింత అందంగా ముస్తాబుకానున్నాయి. సింగపూర్‌ తరహాలో బస్‌టర్మినల్‌, అంతర్జాతీయ స్థాయి హంగులతో బస్‌బేలు, అధునాతన ఏసీ బస్‌ షెల్టర్లు, టాయిలెట్లు, పచ్చదనంతో కూడిన జంక్షన్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా రూ. 30 కోట్లతో జరుగుతున్న ఫుట్‌పాత్‌లు, బస్‌షెల్టర్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ గురువారం పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదుట థీమ్‌ పార్కులను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారని పేర్కొన్నారు. ఏడాదిలోపు ఇక్కడ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. మంత్రి వెంట జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, జలమండలి అధికారులు ఉన్నారు.