మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Jul 15, 2020 , 22:50:36

అత్యాధునిక హంగులతో.. ఆటోనగర్‌లో బస్‌ స్టేషన్‌

అత్యాధునిక హంగులతో.. ఆటోనగర్‌లో బస్‌ స్టేషన్‌

 మన్సూరాబాద్‌ : ఆటోనగర్‌ హరిణ వనస్థలి నేషనల్‌ పార్కు సమీపంలో అధునాతన హంగులతో జిల్లాలకు వెళ్లే బస్‌ స్టేషన్‌లను నిర్మిస్తామని ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధి ఆటోనగర్‌లోని హరిణ వనస్థలి నేషనల్‌ పార్కు సమీపంలో నూతనంగా నిర్మించనున్న బస్‌ స్టేషన్‌ ప్రదేశాన్ని బుధవారం ఆయన హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డితో పాటు ఫారెస్ట్‌ అధికారులు, మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి, హయత్‌నగర్‌ కార్పొరేటర్‌ సామ తిరుమల్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిణ వనస్థలి నేషనల్‌ పార్కు సమీపంలో నిర్మించనున్న బస్‌ స్టేషన్‌ ఏర్పాటు కోసం అటవీశాఖ అధికారుల అనుమతులు తీసుకుంటామని తెలిపారు. అత్యంత రద్దీ ప్రాంతమైన ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఉన్న జిల్లాలకు వెళ్లే బస్‌ స్టేషన్‌ను అతి త్వరలో ఆటోనగర్‌కు తరలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్‌ అధికారులు శివయ్య, రవీందర్‌ రెడ్డి, సరిత, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నాగరాజు, మాజీ అధ్యక్షుడు జగదీశ్‌యాదవ్‌, నాయకులు పారంద నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo