గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 10, 2020 , 17:02:50

అదే ఆఖరి ముద్ద... అన్నం తింటూ చిన్నారి..

అదే ఆఖరి ముద్ద... అన్నం తింటూ చిన్నారి..
  • అన్నం తింటూ మూడంతస్తుల భవనం పైనుంచి పడి బాలుడు..

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌, సుభాశ్‌నగర్‌ పైప్‌లైన్‌ రోడ్డులోని లక్ష్మిగంగా ఎన్‌క్లేవ్‌లో  నితిన్‌రెడ్డి కు టుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, కొడుకు  శ్రీహన్‌రెడ్డి(6) ఉన్నారు. కాగా.. ఆదివారం జీడిమెట్ల గ్రామ సమీపంలోని భీమ ప్రైడ్‌లో ఉండే సోదరుడి ఇంటికి శ్రీహన్‌రెడ్డిను తీసుకుని తల్లి వచ్చింది. సోమవారం కొడుకుకు అన్నం తినిపించుకుంటూ బాల్కనీలో ఉంది. తల్లి అనుకోకుండా ఇంట్లోకి వెళ్ల గా.... బాల్కనీలో నీరుండగా కాలుజారి  శ్రీహన్‌రెడ్డి  మూడంతస్తుల భవనంపై నుంచి కింద పడిపోయా డు.  వెంటనే కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.  

ఐదంతస్తుల భవనంపైనుంచి పడి డిగ్రీ విద్యార్థి...

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌.. పైప్‌లైన్‌ రోడ్డులోని ఎన్‌సీఎల్‌ గోదావరి హోమ్స్‌కు చెందిన నాగరాజు కుమారుడు సుబ్రహ్మణ్యం(18)  డిగ్రీ మొదటి సంవత్స రం చదువుతున్నాడు. వీరికి షాపూర్‌నగర్‌లో బియ్యం దుకాణముంది.  సోమవారం సుబ్రహ్మ ణ్యం.. తను ఉంటున్న అపార్టుమెంట్‌ లోని ఐదంత స్తుల పై నుంచి అనుమానాస్పద స్థితిలో కింద పడి మృతి చెందాడు. అయితే.. సుబ్రహ్మణ్యంపై ఆదివా రం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బియ్యం దు కాణంలో ఇద్దరు యువకులు సీరియస్‌గా మాట్లాడారని, ఈరోజు కూడా వారి నుంచి  ఫోన్‌ వచ్చిన వెంటనే భవనంపైకి వెళ్లాడ ని మృతుడి తండ్రి తెలిపాడు.  ప్రమాదవశాత్తు కింద పడ్డాడా?.. లేక ఆ యువకులు ఏమైనా బెదిరింపులకు పాల్పడితే ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? అనేది తెలియడంలేదు. తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


logo