పుస్తకాలొచ్చాయి..

స్కూళ్లు తెరవగానే అందజేత
ఆధార్, చైల్డ్ ఇన్ఫో ఉన్నవారికే బుక్స్
హైదరాబాద్ జిల్లాకు 7.5 , మేడ్చల్‌కు 4.4 రంగారెడ్డికి 8.11లక్షల పుస్తకాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొత్త విద్యాసంవత్సరంలో తరగతుల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతుండగానే విద్యాశాఖ అధికారులు పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం.. స్కూళ్లు తెరిచి పుస్తకాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాకు 7.5 లక్షల ఉచిత పాఠ్యపుస్తకాలు అవసరమని అధికారులు తేల్చారు. అయితే ఆధార్ డేటా.. చైల్డ్ ఇన్ఫోలో పేరు ఉన్న వారికి మాత్రమే పుస్తకాలు అందజేస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పుస్తకాలు దుర్వినియోగం కాకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
రామంతాపూర్‌లోని గోడౌన్‌కు..
పాఠశాల తెరిచిన రోజునే పుస్తకాలను విద్యార్థులకు అందజేయాలన్న సంకల్పంతో విద్యాశాఖ అధికారులు ముందుగానే కసరత్తు చేస్తారు. ఇందుకు సన్నద్ధ ప్రక్రియ మార్చిలోనే ప్రారంభమవుతుంది. ఈ సారి లాక్డౌన్ మినహాయింపుల తర్వాత ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పుడున్న విద్యార్థుల సంఖ్య మేరకు హైదరాబాద్ జిల్లాకు 7.5 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని లెక్క తేల్చారు. ఇప్పటికే కొన్ని పుస్తకాల ముద్రణ పూర్తికాగా వాటిని రామంతాపూర్‌లోని గోడౌన్‌కు చేర్చారు. అక్కడి నుంచి మండలకేంద్రాలకు, తిరిగి స్కూళ్లకు తరలించనున్నారు.
తగ్గిన కోటా..
అయితే జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాల కోటా భారీగా తగ్గడం గమనార్హం. ఏటా 11 నుంచి 12.5 లక్షల వరకు పాఠ్యపుస్తకాలు జిల్లాకు అవసరమవుతాయి. గత పదేండ్లుగా అంతే మొత్తంలో పాఠ్యపుస్తకాలకు ఇండెంట్ (ప్రతిపాదనలు) పంపిస్తున్నారు. ఈ ఏడాది 7.5 లక్షలకు తగ్గిపోయాయి. ప్రభుత్వం గురుకులాలను ప్రారంభించడం, చాలా మంది ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు గురుకులాల్లో చేరడంతో ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని అధికారులు పేర్కొంటున్నారు. ఆయా విద్యార్థులకు గురుకుల విద్యాసంస్థ ద్వారానే పుస్తకాలు పంపిణీ చేస్తుండటంతో జిల్లా కోటా నుంచి మినహాయించారు.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి, నమస్తేతెలంగాణ : జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,338కి పైగా పాఠశాలల్లో సుమారు 1.55 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. కాగా 8,11,120 పుస్తకాలు వచ్చాయి. వీటిని రామంతాపూర్‌లోని గోదాముకు తరలించారు. గతేడాది మిగిలిన పుస్తకాలు 38,724 ఉన్నాయి. వీటిని ఈసారి పంపిణీ చేయనున్నారు. ఇంకా 72,240 పుస్తకాలు వస్తాయని అధికారులు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో..
మేడ్చల్, నమస్తే తెలంగాణ : 2020-21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు వచ్చేశాయి. డీఐఎస్ఈ ప్రకారం ఆరు సబ్జెక్టులకు గాను జిల్లాకు మొత్తం 4,66,680 పుస్తకాలు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 94 శాతం అంటే 4,40,080 పుస్తకాలు వచ్చాయని జిల్లా విద్యాధికారి ఐ.విజయకుమారి తెలిపారు. మరో 26,600 పుస్తకాలు (6శాతం) రావాల్సి ఉందని, త్వరలోనే పుస్తకాలన్నీ వస్తాయని తెలిపారు. ఈ పుస్తకాలను రామంతాపూర్‌లోని ప్రభుత్వ గోదాములో భద్రపరిచామని, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
- మోసాలకు పాల్పడుతున్న ముఠాల అరెస్ట్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- లగ్జరీ కారులో రయ్యిమంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్
- ఆన్లైన్లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు
- ఇక స్కూళ్లల్లోనూ ఇంటర్ పరీక్ష కేంద్రాలు
- లాస్యతో కుమార్ సాయి స్టెప్పులు... వీడియో వైరల్
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు