పహాడీషరీఫ్ జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ గ్రామంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు అమ్మవారికి బోనాలు తీశారు. మొక్కులు తీర్చుకున్నారు. నైవేధ్యం సమర్పించారు. పోచమ్మ ఆలయంలో ఆలయకమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.