e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home హైదరాబాద్‌ ఉత్సవ ఘటం అమ్మకు ఫలహారం

ఉత్సవ ఘటం అమ్మకు ఫలహారం

  • పులకించిన భక్తజనం
  • అంబారీపై వైభవంగా అమ్మవారి ఊరేగింపు
  • భక్తుల వెన్నంటే నేను.. భవిష్యవాణి
  • అడుగడుగునా పోలీసుల పహారా

హైదరాబాద్‌ సంస్కృతి ప్రతిబింబించేలా భాగ్యనగర ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘటాల ఊరేగింపు కొనసాగింది. లాల్‌ దర్వాజా సింహవాహిని, ఉప్పుగూడ మహంకాళి, గౌలిపుర భరత్‌మాత, సుల్తాన్‌ షాహీ దర్బార్‌ మైసమ్మ, మీరాలం మండి శ్రీ మహాకాళేశ్వర దేవాలయాల్లో రంగం కార్యక్రమం నిర్వహించగా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకొని చల్లగా చూడాలని వేడుకున్నారు. మరోవైపు ఉత్సవాలను పురస్కరించుకొని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

“అమ్మా బైలెల్లినాదో.. నాయనా… తల్లీ బైలెల్లినాదో…’’ అంటూ జానపద గీతాల్లో ఆవిషృతమైన ఆదిశక్తి స్వరూపమైన అమ్మవారిని సోమవారం పాత నగర పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. పాతనగర బోనాలు ముగిసిన మరుసటి రోజు నిర్వహించే ఊరేగింపు ఆనవాయితీని కొనసాగిస్తూ భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అంగరంగవైభవంగా కొనసాగింది. మధ్యా హ్నం లాల్‌దర్వాజా సింహవాహిణి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణతల భవిష్యవాణి (రంగం) కార్యక్రమం జరిగింది.

భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత ..

- Advertisement -

‘నా భక్తులను నేను కాపాడుకోవడానికి వెన్నంటే ఉంటాను. నన్ను కొలిచే భక్తుల వెన్నంటే ఉంటూ వారిని నేను కాపాడుకుంటాను. ఎంత పెద్ద ఆపద వచ్చినా ప్రజల వెన్నంటే ఉంటూ కాపాడుకుంటాను. వర్షాలకు కొదవలేదు. పాడి పంటలు సమృద్ధిగా అంది స్తా. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.’ అని మాతంగి స్వర్ణలత లాల్‌దర్వాజా సింహవాహిణి అమ్మవారి ఆలయం వద్ద భవిష్యవాణి వినిపించారు.

అలరించిన కార్యక్రమాలు…

గౌలిగూడ మహంకాలి అమ్మవారి ఆలయంలో సోమవారం రంగం కార్యక్రమంలో భాగంగా గణేష్‌ భవిష్యవాణి వినిపించారు. మారేడ్‌పల్లి మైసమ్మ ఆలయ బోనా ల వేడుకలో రాష్ట్ర పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొని అమ్మవారికి పూజలు జరిపించా రు. అంబర్‌పేట మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రత్యేక పూజలు చేశారు. కార్వాన్‌ దర్బార్‌ మైస మ్మ ఆలయం వద్ద రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు. అంబర్‌పేట బుజిలి మహంకాళి, పటేల్‌నగర్‌ పటేల్‌ మహంకాళి, గోల్నాక అశోక్‌నగర్‌ దేవి నల్ల పోచ మ్మ, దుర్గా నగర్‌ దుర్గా మైసమ్మ, అన్నపూర్ణనగర్‌ బంగారు మైస మ్మ, బొల్లారం ముత్యాలమ్మ, కవాడిగూడ కనకాల కట్టమైసమ్మ, చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయాలతో పాటు పాత మలక్‌పేట డివిజన్‌లోని నల్లపోచమ్మ ఆల యం పరిధిలో ఘటా లు, ఫలారపు బం డి, తొట్టెల ఊరేగిం పు,శివసత్తుల, పోతరాజు ల విన్యాసాలు రంజింపజేశా యి. కాచిగూడ రైల్వేస్టేషన్‌, నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన త్రీడీ షో స్థానికులను విశేషంగా ఆకట్టుకుని, మంత్రముగ్దుల్ని చేసింది.

అంబారీపై అమ్మవారి ఊరేగింపు

అక్కన్న మాదన్న ఆలయంలోని అమ్మవారిని ఏనుగు అంబారీపై ప్రతిష్టించి పాత నగర పురవీధుల్లో ఊరేగించారు. ఈ సంవత్సరం తమిళనాడు రాష్ర్టానికి చెందిన లక్ష్మీ ఏనుగు అంబారీపై అమ్మవారిని ప్రతిష్టించగా, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ జెండా ఊపి ఊరేగింపును ప్రారంభించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana